ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:40 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఓబీ మట్టి రవాణాతో రూ.40 లక్షల రోడ్డు ధ్వంసంకేంద్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం: మొలుమూరి శ్రీనివాస్,

ఓబీ మట్టి రవాణాతో రూ.40 లక్షల రోడ్డు ధ్వంసంకేంద్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం: మొలుమూరి శ్రీనివాస్

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 19:

సింగరేణి ఆర్‌జీ-3 నుంచి ఓబీ మట్టిని భారీ వాహనాలతో తరలించడంతో పన్నూరు నుంచి ఏఎల్‌పీ గని, జీఎం కార్యాలయం, జేఎన్‌టీయూ, వి.టి.సి. ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ ఆరోపించారు. అధిక బరువుతో తిరిగిన వాహనాలపై చర్యలు తీసుకోవాలని, రహదారి మరమ్మతులకు సింగరేణి నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఓబీ మట్టి తరలింపునకు సంబంధించిన అనుమతులు, ఒప్పందాలు, వాహనాల బరువు, ట్రిప్పుల వివరాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ వ్యవహారంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి, కేంద్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సంస్థకు నష్టం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.